ప్రజాశక్తి- నందిగామ (ఎన్‌టిఆర్) : నందిగామ పురపాలకసంఘ పరిధిలో వరద ముప్పునకు గురైన 1,7,8 వార్డులలో మున్సిపల్ కమిషనర్ ఎస్.జయరామ్ శనివారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా నందిగామ మున్సిపల్ కమిషనర్ ఎస్ జయరామ్ వార్డులోని ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వరద ముప్పు క్రమంగా తగ్గు ముఖం పట్టిందని, ఎటువంటి ఇబ్బంది వచ్చిన తక్షణమే తెలపాలని సూచించారు. ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా వరద ప్రభావిత ఏరియాలలో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. వరద తగ్గు ముఖం పట్టిన ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అంటువ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని సచివాలయ హెల్త్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలలో వరదనీరు తగిన ప్రదేశాలలో బ్లీచింగ్, మలాతిన్ చల్లిమ్చారు. శానిటేషన్, హెల్త్ సిబ్బంది అందరు కలిసి ఇంటింటి ఫీవర్ సర్వ్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమములో కౌన్సిలర్ పాకలపతి కిరణ్, మునిసిపల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జే.ఫణి శ్రీనివాసరావు , టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఝాన్సీ , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










