Sep 22,2023 11:49

విజయనగరం : విజయనగరం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో జిల్లా పరిషత్‌ సాధారణ నిధులు సుమారు 11 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆరో ప్లాంట్‌ను విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, మేయర్‌ వెంపటాపు విజయలక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ ... ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో తాగునీటి సమస్య ఉందని తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో ... జిల్లా పరిషత్‌ సాధారణ నిధుల నుంచి సుమారు 11 లక్షలు ఖర్చు చేసి ఆస్పత్రిలో 24 గంటలు స్వచ్ఛమైన తాగునీరు రోగులకు, వైద్య సిబ్బందికి అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సీఈఓ రాజకుమార్‌, జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ అప్పలనాయుడు, ప్రిన్సిపల్‌ పద్మాలీల, డిఎంఅండ్‌హెచ్‌ఓ భాస్కర్‌ రావు, ఆర్డబ్ల్యూఎస్‌ఎస్‌ ఈ.ఉమా శంకర్‌, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.