Aug 29,2023 15:49

ప్రజాశక్తి -సామర్లకోట రూరల్‌ (కాకినాడ) : తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మంగళవారం సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామానికి చెందిన జమున నగర్‌ కాలనీలో బాల మందిరం నిర్వహిస్తున్న కన్వీనర్‌ కవి, రచయిత, అంగర గోపాలకృష్ణ (కృష్ణ శ్రీ)ను కలెక్టర్‌ డాక్టర్‌ కృతిక శుక్ల ఘనంగా సత్కరించారు. కాకినాడ కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన గిడుగు రామమూర్తి పంతులు జయంతి సభలో కలెక్టర్‌ కృతికాశుక్ల పదిమంది కవులు, రచయితలను సత్కరించారు. ఈ సందర్భంగా కవి కృష్ణ శ్రీ మాట్లాడుతూ.. తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా సత్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు భాషను బ్రతికించుటకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి తదితరులు పాల్గొన్నారు.