Sep 14,2023 13:42

ప్రజాశక్తి-కాకినాడ : ప్రజాశక్తి దినపత్రిక 43వ వార్షికోత్సవం సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచికను కాకినాడ కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్ల ఆవిష్కరించారు. కలెక్టర్‌ ఛాంబర్‌లో గురువారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ప్రజాశక్తి తన ప్రస్థానంలో 42 ఏళ్లు పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యేలా వార్తలను ప్రచురిస్తూ ప్రజాశక్తి భవిష్యత్తులో దినదినాభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సమన్వయ కమిటీ కన్వీనర్‌ ఎన్‌. పావన మూర్తి, కాకినాడ జిల్లా స్టాఫ్‌ రిపోర్టర్‌ ఎం.లక్ష్మణ్‌, సిబ్బంది సురేష్‌, రామకృష్ణ, రిపోర్టర్‌ ఎం.కృష్ణ, సోనీ తదితరులు పాల్గొన్నారు.