Nov 23,2022 13:46

ఇంటర్నెట్‌డెస్క్‌ : శీతాకాలంలో చర్మంపై ఎర్రటి దద్దుర్లు వస్తున్నాయా? అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో చర్మం తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఈ కాలంలో చాలామందికి చర్మంపొడిబారుతుంది. పాదాలు పగులుతాయి. చర్మంపై అక్కడక్కడా ఎర్రటి దద్దుర్లు వస్తాయి. ఇలాంటి సమస్యలతో చాలామంది ఇబ్బందులెదుర్కొంటారు. పొడిబారడం వంటి సమస్యలు ఈ కాలంలో సాధారణమైన విషయాలే అయినప్పటికీ ఎర్రటి దద్దుర్లు ఏర్పడితే మాత్రం తగు చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎర్రటి దద్దుర్లను వైద్య పరిభాషలో కోల్డ్‌ ఉర్టికేరియా అంటారు. ఈ కాలంలో చల్లటి వస్తువులు తిన్నా, తాగినా, లేక చర్మానికి చలి తగిలినా దద్దుర్లు ఏర్పడతాయట. అయితే శరీరానికి తగినంత ఉష్ణోగ్రత అందిన వెంటనే ఈ దద్దుర్లు వాటంతట అవే తగ్గిపోతాయట. ఒకవేళ దద్దుర్లు తగ్గనియెడల వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. దీర్ఘకాలంగా చర్మంపై ఎర్రటి దద్దుర్లు ఉంటే.. క్యాన్సర్‌కు గురయ్యే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.
- చలికాలంలో తప్పనిసరిగా వేడి ఆహార పదార్థాలనే తినాలి. వేడి నీటితోనే స్నానం చేయాలి.
- శరీర ఉష్ణోగ్రతను పెంచే దుస్తులనే ధరించాలి. చిన్నారులకు తప్పనిసరిగా స్వెటర్‌ వేయాలి. వారి కాళ్లకు, చేతులకు గ్లౌజులు తొడగాలి.