
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25, 26 తేదీల్లో సిటిజన్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌ను గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహించాలని అధికారులను గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది టీమ్‌గా ఏర్పడి ఈ ప్రోగ్రామ్‌ను పూర్తి చేయాలని, సచివాలయ సిబ్బంది వారీ టీమ్‌ను లీడ్ చేస్తూ ప్రోగ్రామ్‌ను పూర్తి చేయాలని పేర్కొంది. ముఖ్యంగా ఇకెవైసి పెండింగ్ ఉన్న వారికి పూర్తి చేయాలని, సెప్టెంబరులో అందించనున్న వైఎస్‌ఆర్ చేయూత పథకం కోసం ఇకెవైసి తప్పనిసరి అని ఆ శాఖ తెలిపింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌తోపాటు ఇకెవైసి పూర్తి కావాల్సి ఉండగా, అందుకు భిన్నంగా అక్కడక్కడా ఈ ప్రక్రియ పూర్తికాకపోవడంతో సంక్షేమ పథకాలు కొందరికి అందడం లేదని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సచివాలయ ఉద్యోగులు కృషి చేయాలని ఆ శాఖ పేర్కొంది.