Jul 25,2023 16:12

ప్రజాశక్తి కాకినాడ : కాకినాడ జిల్లా యునైటెడ్‌ పాస్టర్‌ ఫెలోషిప్‌, ఆల్‌ ఇండియ క్రిష్టియన్‌ కౌన్సిల్‌ సంయుక్తముగా మంగళవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. మణిపూర్‌లో జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాలు ఖండిస్తూ శాంతిభద్రతలు కాపాడాలని కోరుతూ స్థానిక భానుగుడి జంక్షన్‌ నుండి కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ కోనసాగింది. రాష్ట్ర పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఉపాధక్షులు బిషప్‌ జి.జోసెప్‌ బెన్నీ, కాకినాడ జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ అధ్యక్ష్యులు రెవ.డా. జి.జి. సామ్యూల్‌ సాగర్‌, ఆల్‌ ఇండియా క్రిష్ణయన్‌ కౌన్సిల్‌ జిల్లా అధ్యక్షుడు రిక్కి గూటం, జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ జనరల్‌ సెక్రటరీ శిరమ్‌ ఐజాక్‌, జాయింట్‌ ట్రెజరర్‌ విజరు కుమార్‌, జిల్లా క్రైస్తవ పెద్దలు విలియమ్స్‌, ఏల్చురి పాపారావు సీ వై ఎఫ్‌. మూర్తి రాజు, మరి కొందరు జిల్లా నాయకులు రెవ.డా. పి. విజరు కుమార్‌ హస్‌ ఆఫ్‌ ప్రేయర్‌ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుండి క్రైస్తవ నాయకులు, మండల ఫెలోషిప్‌ నాయకులు, విశ్వాసులు భారీ ఎత్తున తరలి వచ్చారు. జిల్లా నాయకులు మాట్లాడుతూ క్రైస్తవులు పువులు శాంతి కాముకులని దేశ క్షేమము కొరకు ప్రార్ధించే వారమని, అటువంటి క్రైస్తవులను, పాస్టర్స్‌ ను హింసించడం, మందిరాలు కూల్చివేయడం అమానుషమని, స్త్రీలను అవమాన పరచడం మరింత దారుణమని పేర్కొన్నారు. వెంటనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయమై స్పందించాలని మణిపూర్‌ లో పరిస్థితిని చక్కదిద్దలని కోరారు. ర్యాలీలో క్రైస్తవులు ఉద్వేగముతో నినాదాలు చేస్తు శాంతి భద్రతలను పరిరక్షించాలని, మహిళలపై జరుగుతున్న అకత్యాలు అరికట్టాలని డిమాండ్‌ చేసారు. బిషప్‌ ఈలి సువార్త రాజు, రెవ సురేంద్ర కుమార్‌ మరికొంత మంది మాట్లాడారు. కైస్తవు నాయికులు జిల్లా కలెక్టర్‌ ని కలసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమములో జిల్లా, మండలాల క్రైస్తవ నాయకులు రీజనల్‌ నాయకులు, స్థానిక ఫెలోషిప్స్‌ క్రైస్తవ సంస్థలు, కాకినాడ సర్‌ క్రైస్ట్స్‌, క్రిస్టియన్‌ యూత్‌ ఫెలోషిప్‌ కాకినాడ నుండి ఇతర ప్రాంతాల నుండి క్రైస్తవులు విశేషంగా పాల్గొన్నారు.