కోజికోడ్ : భారత గ్రామీణ జీవన స్థితిగతులను వెలుగులోకి తీసుకొచ్చిన ప్రఖ్యాత పాత్రికేయులు పాలగుమ్మి సాయినాథ్‌కు మరో పురస్కారం లభించింది. 2023 సంవత్సరానికి గాను చింతా రవీంద్రన్ పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. ఈ మేరకు చింతా రవీంద్రన్ ఫౌండేషన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. పురస్కారం కింద రూ.50 వేలు నగదు, జ్ఞాపిక అందజేస్తారు. జులై 8న కోజికోడ్‌లోని కెపి కేశవ మీనన్ హాలులో నిర్వహించే చింతా రవీంద్రన్ స్మారక సభలో ఈ పురస్కారాన్ని సాయినాథ్‌కు అందజేయనున్నారు. ఈ సందర్భంగా 'అఖండ భారత్ - దక్షిణాసియా పున్ణచిత్రన' అనే అంశంపై ప్రముఖ పాత్రికేయులు, ఆమ్నేస్టీ ఇంటర్నేషనల్ మాజీ అధిపతి ఆకార్ పటేల్ ..రవీంద్రన్ స్మారకోపన్యాసం చేయనున్నారు.










