Jun 20,2023 16:56

ప్రజాశక్తి-కర్నూలు స్పోర్ట్స్‌ : ఒలంపిక్‌ దినోత్సవన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న అంతర్‌ పాఠశాల చెస్‌, క్యారమ్స్‌ పోటీలను స్పోర్ట్స్‌ అథారిటీ స్టేడియంలోని కాంప్లెక్స్‌లో మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ శామంతక మణి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదడు చురుకుతనానికి చెస్‌ లాంటి క్రీడలు విద్యార్థులకు ఎంతో ఉపకరిస్తాయని, ఇలాంటి క్రీడలపై ఆసక్తి చూపాలని ఆమె కోరారు. పోటీల అభివృద్ధికి తమ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఎప్పుడూ ముందుంటుందని ఆమె తెలియజేశారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు ఈనెల 22వ తేదీన స్పోర్ట్స్‌ అథారిటీ అవుట్‌ డోర్‌ స్టేడియంలో పతకాలతో పాటు ట్రోఫీలను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒలంపిక్‌ అసోసియేషన్‌ నిర్వహణ కార్యదర్శి పి.సునీల్‌ కుమార్‌, సంయుక్త కార్యదర్శి అవినాష్‌ శెట్టి, చెస్‌ సంఘ ప్రతినిధులు రామ సుబ్బారెడ్డి, జిల్లా ఒలంపిక్‌ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

2