Jan 22,2023 09:46

ర్జెంటీనాలోని రోసారియాలో 1928, జూన్‌ 14న ఈ అగ్గిరవ్వ జన్మించాడు. చర్మవ్యాధి నిపుణుడుగా 1953లో 'చే' వైద్యవిద్యలో పట్టభద్రులయ్యారు. 1953-54 జులైలో లాటిన్‌ అమెరికా దేశాలన్నింటినీ పర్యటించారు. 1953లో గ్వాటిమాలా వచ్చాడు. అక్కడ క్యూబా ప్రవాసులను కలిశాడు. వారే ఆయన పేరుకు ముందు 'చే' తగిలించారు. అక్కడ ఆయన అమెరికా గూఢచారి సంస్థ సిఐఎ సహకారంతో జాకోబో ఆర్బెంజ్‌ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి జరిగిన కుట్రను చూశారు.

1112


           ఆయన ఫైడల్‌ కాస్ట్రోను 1955 జులైలో కలుసుకున్నారు. క్యూబాలో ఫుల్జెన్సియో బాటిస్టా నియంతృత్వానికి వ్యతిరేకంగా జులై 26వ తేదీన జరిగే ఉద్యమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఫైడల్‌ కాస్ట్రో నాయకత్వంలో 1956 నవంబర్‌ 25వ తేదీన చే గువేరా మరో 81 మంది విప్లవకారులు 'గ్రాన్మా' అనే పడవలో క్యూబాకు పయనమయ్యారు. క్యూబాలోని సిర్రా మీస్ట్రా పర్వతాల్లో గెరిల్లా పోరాటం ప్రారంభించడానికే వారు అక్కడికి వెళ్లారు.
చే గువేరా ను 1957 జులై 21న కమాండర్‌గా ప్రమోట్‌ చేశారు. ఆయన 'సిరో రెడోన్డో' 8వ దళానికి నాయకత్వం వహించాలి.
చే గువేరా ఏర్పాటు చేసిన 'రేడియో రిబెల్డే' 1958 ఫిబ్రవరి 24వ తేదీన తొలి ప్రసారం. శాంతా క్లారా పోరాటానికి 1958 డిసెంబర్‌ 29-31న చే నాయకత్వం వహించారు. బాటిస్టా ప్రభుత్వాన్ని ఇది కోలుకోని దెబ్బ కొట్టింది.
విప్లవం విజయం సాధించడంతో 1959 జనవరి 3వ తేదీ తెల్లవారు ఝామునే 'చే' హవానా చేరుకున్నారు. లా కాబనా లోని సైనిక స్థావరాన్ని ఆక్రమించే పనిని ఆయనకు కాస్ట్రో అప్పగించారు.

345


'చే' నాయకత్వంలోని ఒక ప్రతినిధి బృందం 1959 జూన్‌ 12వ తేదీన యునైటెడ్‌ అరబ్‌ రిపబ్లిక్‌, భారత్‌, ఇండోనేషియా, శ్రీలంక, యుగోస్లోవియా, మ్యాన్మార్‌, జపాన్‌, పాకిస్తాన్‌, సూడాన్‌, మొరాకోలను సందర్శించి ఆయా దేశాలతో వాణిజ్య, సాంస్కృతిక, దౌత్య సంబంధాల అభివృద్ధికి ప్రయత్నించింది.
       క్యూబాలోని భూసంస్కరణల సంస్థకు చెందిన పారిశ్రామిక విభాగం జాతీయ అధ్యక్షుడిగా 1959 అక్టోబర్‌ 7వ తేదీన చె గువేరాను నియమించారు. బ్యాంక్‌ ఆఫ్‌ క్యూబా అధ్యక్షుడిగా 1959 నవంబర్‌ 26వ తేదీన 'చే' ను నియమించారు. ఆయనను 1961 ఫిబ్రవరి 23వ తేదీన పారిశ్రామిక శాఖా మంత్రిగా నియమించారు.

231


ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో 1964 డిసెంబర్‌ 11వ తేదీన 'చే' ప్రసంగించారు.
         చైనా, మాలి, కాంగో, గునియా, ఘనా, దహోమే, టాంజానియా, ఈజిప్టు, ఆల్జీరియా దేశాల్లో 1965 మార్చి-జనవరిలో పర్యటించారు. ఆయా దేశాల ప్రభుత్వాధినేతలను, జాతీయ విముక్తి పోరాట నాయకులను కలుసుకున్నారు.
ఆల్జీరియాలో 1965 ఫిబ్రవరి 24వ తేదీన జరిగిన రెండవ ఆఫ్రో - ఆసియా సౌహార్ద్ర సదస్సులో 'చే' ప్రసంగించారు.
'చే' 1965 ఏప్రిల్‌ 1వ తేదీన రహస్యంగా క్యూబాను వదిలి కాంగో వెళ్లారు. అక్కడ విప్లవ పోరాటం చేస్తున్న లారెంట్‌ కబిలా గెరిల్లా దళంలో చేరారు.
కాంగోలో దాదాపు ఏడు మాసాలు గడిపిన తరువాత వెళ్లిన కార్యక్రమం విఫలమైంది. దాంతో చె రహస్యంగా 1965 నవంబర్‌ 21వ తేదీన టాంజానియా చేరుకున్నాడు. అక్కడ అనేక వారాలు గడిపారు. అక్కడి నుండి డిసెంబర్‌లో జెకోస్లోవేకియా వెళ్లారు. అక్కడ అనేక మాసాల పాటు రహస్యంగా గడిపారు.
           చే బొలీవియాలోని నాంకాహుజు ప్రాంతంలో సాయుధ పోరాటంలో పాల్గొనేందుకు 1966 నవంబర్‌ 3వ తేదీన అక్కడకు చేరుకున్నారు. బొలీవియా సైన్యంతో జరిగిన పోరాటంలో ఆయన 1867 అక్టోబర్‌ 8వ తేదీన పట్టుబడ్డారు. అమెరికన్‌ సిఐఎ సలహాతో ఆయనను క్వెబ్రాడా డెల్‌ యురో వద్ద నిర్బంధంలో పెట్టారు.
లా హిగెయెరా పట్టణంలోని ఒక చిన్న పాఠశాలలో 1967 అక్టోబర్‌ 9వ తేదీ మధ్యాహ్నం 1.30 గం||కు చే గువేరాను సర్జెంట్‌ మారియో టెరన్‌ హత్య చేశాడు.
గువేరా మరణవార్తను 1967, అక్టోబరు 15వ తేదీన అధికారికంగా ప్రకటించిన కాస్ట్రో, మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాపం.
పది లక్షల మందితో హవానాలో 1967, అక్టోబరు 18వ తేదీన గువేరా స్మారక సభ, కాస్ట్రో ప్రసంగం
మార్చి, 1968లో గువేరా బొలీవియా డైరీ, ప్రచురణ, ప్రజలకు ఉచితంగా పంపిణీ.
మూడు దశబ్ధాల తర్వాత 1997, జూన్‌ 28వ తేదీన గువేరా భౌతిక అవశేషాలను వెలికితీసిన బొలీవియా అధికారులు
గువేరా అవశేషాలను 1997, అక్టోబరులో శాంటాక్లారా (క్యూబా) లో ఖననం చేసిన క్యూబా అధికారులు.