
పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పుంగనూరులో చంద్రబాబు చేసిన అరాచకం దారుణమని ఆయనను ఎ1 ముద్దాయిగా అరెస్టు చేయాలని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ కోరారు. ఆదివారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అరాచకం ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉంటే టిడిపి గూండాలు అరాచకం సృష్టించి రాబోయే ఎన్నికల్లో గెలుపొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్లు కోరాడ శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, మోర్తా గిరీష్, తదితరులు పాల్గొన్నారు.