Oct 19,2023 17:43

ప్రజాశక్తి-రాయదుర్గం(అనంతపురం) : చంద్రబాబుకు మద్దతుగా గురువారం రాయదుర్గం నియోజకవర్గ రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. టిడిపి హయాంలో రైతురథం పథకం కింద లబ్ధిపొందిన రైతులు నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం గొనభావి గ్రామం వద్ద ట్రాక్టర్లతో చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. గురువారం వ్యవసాయ పనులను మానుకుని వివిధ గ్రామాలకు చెందిన రైతులు గోవభావి వద్దకు చేరుకున్నారు. అనంతరం తమ ట్రాక్టర్లను వరుసగా నిలబెట్టి మేము సైతం బాబు కోసమంటూ నినదించారు. చంద్రబాబు హయాంలో తాము సబ్సిడీపై ట్రాక్టర్లను పొందామని, అందుకు కతజ్ఞతగా ఆయన త్వరగా విడుదల కావాలని కోరుకుంటున్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి కాలవ శ్రీనివాసులుతో పాటు టిడిపి మండల కన్వీనర్‌ గిరిమల్లప్ప, ధానవేంద్ర, ఉస్మాన్‌, సర్పంచ్‌ నాగరాజు, సత్తి, సంజీవ, రమేష్‌, చెన్నప్ప, ఆనంద రెడ్డి, దుర్గేష్‌, వెంకటేశులు, చిన్నికష్ణ, మూర్తి, అంజి,దోనప్ప, పాపరాయుడు తదితరులు పాల్గొన్నారు.