Sep 28,2023 16:46

ప్రజాశక్తి-కాకినాడ : ఎస్‌ఎఫ్‌ఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 30వ తేదీన చలో విజయవాడ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం. గంగా సూరిబాబు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా కాకినాడ కచేరి పేటలో ఉన్న సుందరయ్య భవన్లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పోస్టర్‌ విడుదల చేసి అనంతరం ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు ప్రభుత్వ విద్యకు దూరమవుతున్నారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు ప్రభుత్వ విద్యను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామని చెప్పి నేడు పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల పేద విద్యార్థులకు విద్య దూరమవుతున్నారని ప్రభుత్వ విద్యారంగం మొత్తం కార్పోటీకరణ, ప్రైవేట్‌ కరణ, అయిపోతుందని ఈ విధానాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నూతన జాతియ విద్యా విధానాన్ని తీసుకుని వస్తే దేశంలో ఏ రాష్ట్రంలోని అమలు చేయనటువంటి నూతన జాతియ విద్యా విధానాన్ని మన రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందని దీని ద్వారా విద్య మొత్తం ప్రైవేట్‌ కరణ, కేంద్రీకరణ, కాషాయికరణ అవుతుందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల చదివి విద్యార్థులకు ఇప్పటికే నాలుగు నెలలు కావస్తున్న జూనియర్‌ కళాశాల విద్యార్థులకు కనీసం పాఠ్యం పుస్తకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని వ విమర్శించారు. డిగ్రీలో హానర్స్‌ డిగ్రీని ప్రవేశపెట్టడం ద్వారా ఆన్లైన్లో అడ్మిషన్‌ వల్ల ఈరోజుకి డిగ్రీ కళాశాలలో అడ్మిషన్‌ పూర్తిగా కాలేదని తక్షణమే ఆన్లైన్లో అడ్మిషన్‌ పక్రియ ఆపాలని, హనర్స్‌ డిగ్రీ రద్దు చేయాలని, జీవో నెంబర్‌ 77 రద్దుచేసి పీజీలో చదివే ప్రతి ఒక్కరికి ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాకినాడ జిల్లాలో ఉన్న సంక్షేమ హాస్టల్‌ కు నూతన భవనాలు నిర్మించాలని, సంక్షేమ హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌ చార్జీలు పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలని డిమాండ్‌ చూశారు. కాకినాడ జిల్లాలో ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు వాసు, సాహిత్య్‌, ఆదర్శ కార్తిక్‌, పవన్‌, జయరామ్‌ తదితరులు పాల్గొన్నారు.