Jun 13,2023 16:42

ప్రజాశక్తి - సామర్లకోట రూరల్‌ (కాకినాడ) : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తున్న వాలంటీర్ల సేవలు అభినందనీయమని రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, పెద్దాపురం నియోజక వర్గం వైసీపీ ఇంఛార్జి దవులూరి దొరబాబు అన్నారు. సామర్లకోట మండలం జి మేడపాడు గ్రామంలో నిర్వహించిన వాలంటీర్ల పురస్కార సభలో దొరబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని వాలంటీర్లను దొరబాబు దుస్సాలువతో సత్కరించారు. అలాగే హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ డవులూరి దొరబాబును వాలంటీర్‌లు సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొబ్బరాడ సత్తి బాబు, గ్రామ సర్పంచ్‌ పటాని దేవి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ మోరంపూడి రమేష్‌, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మి నారాయణ, పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.