విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు : మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి
ప్రజాశక్తి-మంత్రాలయం(కర్నూలు) : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఆరోపించారు. గురువారం స్థానిక హెచ్ ఆర్‌బి కళ్యాణ మండపంలో అఖిల భారత విద్యార్థి సమైక్య( ఏఐఎస్‌ఎఫ్) అనంతపురం సత్యసాయి కర్నూల్ నంద్యాల జిల్లాల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి జాన్సన్ బాబు, కే.శివారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానాన్ని తీసుకొని వచ్చి ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేటువంటి పద్ధతుల్లో ఉందన్నారు. దేశంలోని 29 రాష్ట్రాలలో జాతీయ నూతన విద్యా విధానాన్ని మొట్టమొదటిగా ఆమోదించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని కేంద్ర ప్రభుత్వం దగ్గర లాలూచీపడి విద్యార్థులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న మూడు సంవత్సరాల డిగ్రీని రద్దు చేస్తూ నాలుగు సంవత్సరాలు డిగ్రీ విధానాన్ని తీసుకోరావడాన్ని ఖండించారు. తక్షణమే నాలుగు సంవత్సరాల డిగ్రీ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి పేద మధ్యతరగతి విద్యార్థులకు జీవో నెంబర్ 77ను తీసుకొని వచ్చి చదువుకు దూరం చేసేటువంటి పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తీసుకొని వచ్చి విద్యార్థి యూనివర్సిటీలలో విద్యార్థులు లేనటువంటి దృష్టికి తీసుకువచ్చారన్నారు. విశ్వవిద్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా 5055 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్న ఇంతవరకు వాటి బట్టి నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు . విభజన చట్టంలో అనంతపురం జిల్లాకు కేటాయించిన సెంట్రల్ యూనివర్సిటీకి నిధులు కేటాయించకుండా వాటి నిర్మాణం చేపట్టకుండా తాత్కాలిక భవనాలలో తరగతులు నిర్వహిస్తూ వసుతి గృహాలలో మౌలిక వసతులు లేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతు గహాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని మిస్ చార్జీలు కాస్మోటిక్ చార్జీలు పెంచాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కొన్ని డిమాండ్ల చేత అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల ముందు మహా ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న విద్యావ్యతిరేక విధానాల ఎండగడుతూ విద్యార్థుల్లోకి తీసుకెళ్లి వాటిపైన ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు ఈ ముగింపు కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య గారు ఏఐఎస్‌ఎఫ్ కర్నూలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమన్న శ్రీరాములు అనంతపురం జిల్లా అధ్యక్షులు కుల్లాయి స్వామి నంద్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు ధనుంజయ సత్యసాయి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి రాజేంద్రప్రసాద్ కర్నూల్ ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు షాబీర్ విజయేంద్ర రంగస్వామి శరత్ థామస్ తదితరులు పాల్గొన్నారు.











