Nov 06,2023 12:20

అనంతపురం : వెనుకబాటులో ఉన్న అనంతపురం జిల్లా అభివఅద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో నవంబర్‌ 6, 7 తేదీలలో జిల్లాలో తలపెట్టిన స్కూటర్‌ యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.మల్లికార్జున పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పార్టీ నాయకులతో కలిసి పార్టీ కార్యాలయం వద్ద ''ప్రజా రక్షణ భేరి''పేరుతో సిపిఎం ముద్రించిన గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ ... జిల్లాలో తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని, వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేల రూపాయలను పంట నష్టపరిహారం కింద అందించాలని కోరారు. జిల్లాలో హెచ్‌ ఎల్‌ సి, హంద్రీ-నీవా కాలువల కింద సాగుచేసిన పంటలకు పూర్తిస్థాయిలో నీరు అందించాలని, పండ్ల తోటల ఆధారిత పరిశ్రమలను స్థాపించి జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని, తదితర డిమాండ్ల సాధనకై సిపిఎం ఈ స్కూటర్‌ యాత్రను చేపడుతోందని అన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ల విడుదల కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు మధు, నాగరాజు, తిమ్మరాజు, రమేష్‌, అనిల్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు బంగి శివ, తదితరులు పాల్గొన్నారు.