ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఏఐఎఫ్‌టీయు ఆధ్వర్యంలో నిర్వహించే కార్మిక ప్రదర్శన, సదస్సును జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి గంగన్న పిలుపునిచ్చారు.మంగళవారం పట్టణంలోని ఆర్‌సీసీ కార్యాలయంలో ఆర్‌సిసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌సీసీ రాష్ట్ కార్యదర్శి ప్రతాప్, ఏఐఎఫ్‌టీయు నాయకులు వెంకప్ప, బన్ను ఉసెని, లక్ష్మన్న, బాష, జాను ఈరప్పా, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సుజ్ఞానమ్మ పాల్గొన్నారు










