ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : మండలంలోని తాపేశ్వరం శివారు పేకేటిపాకల తుల్యభాగ మేజర్ డ్రైన్ గట్టున ఉన్న పశువులపాక శుక్రవారం రాత్రి దగ్ధం కావడంతో ఒక గేద పాక్షికంగా కాలిపోయింది. పశువులపాక పూర్తిగా కాలిపోయి బూడిదయ్యింది. దీంతో సుమారు 50 వేల రూపాయల నష్టం వాటిల్లిందని గ్రామానికి చెందిన పశుపోషకుడు వాసంశెట్టి లక్ష్మణ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో తమ బంధువే ఈ పని చేశాడని గతంలోనూ ఇంటి గేట్లు పీకు వేశాడని లక్ష్మణ్ స్వామి చెబుతున్నాడు. రాత్రి గ్రామ ప్రజలంతా మంటలను అదుపు చేశారని దీంతో రెండు గేదెలు సురక్షితంగా బయటపడ్డాయని తెలిపారు. ఈ విషయంపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.










