ఇంటర్నెట్‌డెస్క్ : బెల్లీ ఫ్యాట్ (ఉదర కొవ్వు)ని తగ్గించుకోవాలని చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫ్యాట్ తగ్గకపోవడంతో ఆందోళన చెందుతారు. బెల్లీ ప్యాట్ తగ్గితే గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు దరిచేరవు అని వైద్యులు సూచిస్తున్నారు. మరి మీరు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు ఎలాంటి వ్యాయామాలు చేయాలో నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా..!
రన్నింగ్
రన్నింగ్ వల్ల బెల్లీ ఫ్యాట్ త్వరగా తగ్గుతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే రన్నింగ్ చేస్తే.. శరీరంలోని కొవ్వు తగ్గడమే కాదు.. గుండె ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సైక్లింగ్
బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి చేసే వ్యాయామాల్లో సైక్లింగ్ ద బెస్ట్‌గా నిలుస్తుంది. సైకిల్‌ని ఇరుకు రోడ్ల మధ్య కాకుండా.. బయట ప్రదేశాల్లో తొక్కడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాయామాన్ని రోజూ చేయకపోయినా.. కనీసం వారాంతంలో ఒక్కసారైనా ప్రయత్నిస్తే ఉదర భాగంలోని కొవ్వు తగ్గి ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
స్విమ్మింగ్
స్విమ్మింగ్ వల్ల శరీరంలోని కండరాలన్నీ ప్రభావితమవుతాయి. మరీ ముఖ్యంగా స్విమ్మింగ్ వల్ల ఉదరకండరాలు ప్రభావితమై కొవ్వు తగ్గించేందుకు సహాయపడతాయి. స్విమ్మింగ్‌లో కూడా బటర్‌ఫ్లై స్ట్రోక్‌ని ప్రయత్నిస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
స్కిప్పింగ్
తేలికపాటి వ్యాయామాల్లో స్కిప్పింగ్ ఒకటి. స్కిప్పింగ్ చేయడం వల్ల శరీర కండరాలు ప్రభావితమవుతాయి. ఈ వ్యాయామం వల్ల ఉదర భాగంలోని ఫ్యాట్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.