May 02,2023 12:24

ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల) : కారు, స్కూటీ ఢీకొట్టుకోవడంతో మహిళ ఎడమకాలు విరిగి తీవ్రగాయాలైన ఘటన మంగళవారం వేటపాలెం సెయింట్‌ ఆన్స్‌ కాలేజీ దగ్గర జరిగింది. చీరాల వైపు పోవు రోడ్డు వద్ద ఈరోజు ఉదయం 8:15 గంటల సమయంలో ap39DA3575 నెంబర్‌ ఉన్న కారును పెదమత్తూరు గ్రామానికి చెందిన అమరావతి (9177122137) అనే వ్యక్తి డ్రైవింగ్‌ చేస్తున్నాడు. ఒంగోలు వైపు నుండి కారులో వస్తూ సెయింట్‌ ఆన్స్‌ కాలేజీలోకి పోవు రోడ్డు వద్ద మలుపు తిప్పుతుండగా, ఎదురుగా ఒంగోలు వైపు నుండి (బండి నెంబరు లేదు) అంగడి ప్రసన్నకుమారి (భర్త పేరు చంద్ర 35 సంవత్సరాలు) స్టువర్టుపురం (9030652661), ఆమె కుమారుడు దీపు స్కూటీ పై వస్తున్నారు. రోడ్డుపై మలుపుతిరుగుతున్న కారు, స్కూటీని ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ప్రసన్నకుమారికి ఎడమ కాలు విరిగింది. ఆమె తలకు తీవ్రరక్తగాయమయ్యింది. ఆమె కుమారుడు దీపుకు ఎలాంటి గాయాలు తగలలేదు. తీవ్రంగా గాయపడిన ఆమెను 108 వాహనంలో చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారాన్ని వేటపాలెం ఎస్సై కి తెలియపరచడంతో ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.