
'నేను మంచి స్థాయికి ఎదిగాను. నేను ఏం చేయాలో ఇంకొకరు చెప్పాలని నేను అనుకోను. నా పెళ్లి విషయంలో నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకున్నారు. వారు నాకు స్వేచ్ఛ ఇచ్చారు. నేను స్వేచ్ఛ లేకుండా జీవించలేను. అది వాళ్లకు తెలుసు. 'మా అమ్మమ్మ బతికి ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేది. పెళ్లి చేసుకోకూడదా అని అడుగుతూనే ఉండేది. ఆమె ఇప్పుడు ఈ లోకంలో లేరు. ఆమె తప్ప మరెవరూ ఈ విషయంలో పెద్దగా పట్టించుకోలేదు' అని నిత్య మీనన్ తన పెళ్లి విషయంపై ఓ ఇంటర్వూలో మాట్లాడారు.