Sep 05,2022 08:33

ప్రజాశక్తి - అమరావతి : సౌత్‌ ఈస్ట్రన్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో ఆధునికీకరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పలు రైళ్లు రద్దు చేసినటు వాల్తేరు డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. అలాగే, మరికొన్ని రైళ్లు ఆలస్యంగా బయలుదేరుతాయని,ఇంకొన్ని రైళ్ల గమ్యస్థానాలను కుదించినట్టు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
దారి మళ్లించిన రైళ్లు
తిరుపతి-బిలాస్‌పూర్‌ (17482) రైలును 8, 11 తేదీల్లో, బిలాస్‌పూర్‌-తిరుపతి (17481) రైలును 10, 13 తేదీల్లో, పూరీ-అహ్మదాబాద్‌ (12843) రైలును 6, 8, 9, 10, 13, 15 తేదీల్లో, అహ్మదాబాద్‌-పూరీ (12844) రైలును 8, 10, 11, 12, 15 తేదీల్లో టిట్లాఘర్‌, సంబల్‌పూర్‌, జార్సుగూడ మీదుగా దారిమళ్లించారు.
ఆలస్యంగా బయలుదేరే రైళ్లు
విశాఖ-కోర్బా (18518) ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 12న 5 గంటలు, విశాఖ-నిజాముద్దీన్‌ (12897) సమతా ఎక్స్‌ప్రెస్‌ 8, 15 తేదీల్లో 2 గంటలు, హజ్రత్‌ నిజాముద్దీన్‌-విశాఖ (12808) సమతా ఎక్స్‌ప్రెస్‌ 12న 5 గంటలు, తిరుపతి-బిలాస్‌పూర్‌ (17482) ఎక్స్‌ప్రెస్‌ 15న 4 గంటలు, విశాఖ-భగత్‌ కీ-కోఠి (18573) రైలు ఆలస్యంగా బయలుదేరుతాయి.
రద్దు చేసిన రైళ్లు
ఈ నెల 6 నుంచి 12 వరకు విశాఖ-రాయపూర్‌ (08528), 7 నుంచి 13 వరకు రాయపూర్‌-విశాఖ(08527) రైళ్లను మహాసముండ-రాయపూర్‌-మహాసముండ స్టేషన్ల మధ్య రద్దు చేశారు. ఈ నెల 11న విశాఖ-కోర్బా (18518), 12న కోర్బా-విశాఖ (18517), 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విశాఖ-దుర్గ్‌ (18530), 7 నుంచి 13 వరకు దుర్గ్‌-విశాఖ (18529) రైళ్లను రద్దు చేశారు.