Jan 30,2023 13:18

ఇంటర్నెట్‌డెస్క్‌ : గుమ్మడిని తినడం వల్ల గర్భిణీ ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్నా.. దానివల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. మరి ఆ ప్రభావాలు ఏంటో తెలుసుకుందామా..!

- గర్భధారణ సమయంలో గుమ్మడికాయను తినడం వల్ల.. కడుపు తిమ్మిరి తగ్గుతుంది. అయితే గర్భిణీలు గుమ్మడికాయను మితంగానే తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
- గుమ్మడికాయను తింటే గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అయితే గుమ్మడికాయలో చక్కెర, బెల్లం కలపకుండా.. గుమ్మడికాయను విడిగా ఉడికించి తింటేనే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.
- గుమ్మడికాయ జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్దాకాన్ని నివారిస్తుంది.
- గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే వీటి గింజల్లో ఒమేగా - 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిండం మెదడు అభివృద్ధికి సహాయపడతాయి.

దుష్ప్రభావాలు
- గుమ్మడికాయను తింటే ఆరోగ్య ప్రయోజనాలున్నాయని గర్భిణీలు దాన్ని అతిగా తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. గుమ్మడికాయ తిన్నప్పుడు తలనొప్పి, కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఈ విత్తనాలు అధిక స్థాయిలో హార్మోన్లను విడుదల చేస్తాయి. వీటివల్ల గర్భిణీ స్త్రీలు అలెర్జీ సమస్యలకి గురయ్యే అవకాశం ఉంది.

pumpkin