Oct 20,2022 18:37

మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా రక్తపోటు ఉందా? అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. రక్తపోటునే హైపర్‌టెన్షన్‌గా డాక్టర్లు సూచిస్తారు. హైపర్‌టెన్షన్‌ ఎక్కువైతే.. హృదయ సంబంధిత సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గుండెనొప్పితోపాటు.. కిడ్నీ సమస్యలు కూడా ఎక్కువవుతాయట. వీటితోపాటు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు.


- కొంతమందిలో ఈ హైపర్‌టెన్షన్‌ జన్యుపరంగా వస్తుంది. తల్లిదండ్రులకు ఉంటే.. ఆ తర్వాత వారి పిల్లలకి కూడా వచ్చే అవకాశముంది. ఫిట్‌గా ఉన్నవారిపైనా హైపర్‌టెన్షన్‌ ప్రభావం చూపుతుంది. అయితే వైద్యుల సలహామేరకు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని జీన్స్‌ 2మీ వ్యవస్థాపకుడు నీరజ్‌గుప్తా తెలిపారు.
- వంశపారంపర్యంగా వచ్చే రక్తపోటు ప్రభావం 20 నుంచి 55 శాతం వరకు ఉంటుందని పరిశోధనల్లో తేలింది. అయితే వారసత్వంగా వచ్చే హైపర్‌టెన్షన్‌ కన్నా.. రోజువారీ మన జీవనశైలి విధానం ద్వారా కూడా రక్తపోటు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. పొగత్రాగడం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకున్నా రక్తపోటు వస్తుంది.
- మీ కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్‌కు గురయ్యారా వంటి విషయాల్ని తెలుసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మీ కుటుంబ సభ్యుల్లో అధిక రక్తపోటు ఉన్నవారు ఉన్నట్లుయితే.. మీరు తరచూ పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్యులు సలహా ఇస్తన్నారు.