Jul 16,2023 08:15

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కేంద్ర పథకాలకు సోషల్‌ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం ద్వారా ఈ రాష్ట్రానికి ప్రధాని మోడీ ఏమి చేస్తున్నారనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు ఆమె సూచించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం బిజెపి సోషల్‌ మీడియా ప్రతినిధులతో రాష్ట్రస్థాయి సమావేశం  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ, సోషల్‌ మీడియా కన్వీనరు కేశవ్‌ కాంత్‌ పాల్గొన్నారు.