Nov 11,2022 12:56

అనకాపల్లి : విభజన హామీలను ప్రధాని నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ... శుక్రవారం ఉదయం నక్కపల్లిలోని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు మాట్లాడుతూ ... మోడీ పర్యటిస్తున్న వేళ ... రాష్ట్రానికి ప్రత్యేక హౌదా ఇవ్వాలని, విభజన హామీలను అమలు చేయాలని, విశాఖకు రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.