Oct 30,2023 10:43

విజయనగరం : విజయనగరంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 100మందికి పైగా ప్రజలు గాయాలపాలయ్యారు. బాధితులంతా విజయనగరం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం రైలు ప్రమాద బాధితులను సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు. జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, తదితరులు పరామర్శించారు. ఆదివారంన సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, నాయకులు జి.శ్రీనివాస్‌ పరామర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు చేరుకొని క్షతగాత్రులకు అవసరమైన రక్తం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

11