Nov 06,2023 11:01

సికార్‌ : రాజస్థాన్‌లో సిపిఎం అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న సభలకు, ఎన్నికల ర్యాలీలకు భారీగా జనం హాజరవు తున్నారు. రాయిసింగ్‌నగర్‌ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ష్యోంపత్‌రామ్‌ నామినేషన్‌ సందర్భంగా శనివారం వేలాది మంది జనం తరలివచ్చారు. అభ్యర్థికి మద్దతుగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సికార్‌ జిల్లా లక్ష్మానగర్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన విజేందర్‌ దాకా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.