కర్నూలు : చిన్న కడుబూర్ గ్రామంలో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం ప్రచార భేరి కార్యక్రమం బస్టాండ్ ఆవరణంలో నిర్వహించారు. అనంతరం ర్యాలీతో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి తిక్కన్న, సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు పరమేష్ మాట్లాడుతూ ... మోడీ ప్రభుత్వ దుర్మార్గాలను మతతత్వ కార్పొరేట్ కూటమి దుర్నీతిని ప్రశ్నించకుండా ప్రజలు గుర్తించకుండా చేయడానికి ఎక్కడికక్కడ మతకలహాలు పెడుతున్నారని విమర్శించారు. అందరి ఉమ్మడి సంపద ఉన్న బ్యాంకుల్ని ప్రజలు కట్టిన పన్నులతో నిర్మించిన ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నిటినీ, ఓడరేవులన్నిటినీ ఆఖరికి అందరికీ అన్నం పెట్టే రైతు వ్యవసాయాన్ని సైతం కార్పొరేట్లకు బిజెపి ధారాదత్తం చేస్తోందన్నారు. బిజెపిని సాగనంపి.. దేశాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. చిన్న కడుబూరు గ్రామంలో డ్రైనేజీలు వెంటనే క్లీన్ చేయించాలని సిపిఎం సిపిఐ గా డిమాండ్ చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో తిక్కన్న గౌడ్, పరమేశు, నరసన్న, వీరేష్, డోలు అనుమంతు రామాంజనేయులు, ముద్దరంగుడు రాముడు పాల్గొన్నారు.










