విజయవాడ : నేడు విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో సిపిఐ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్న సందర్భంగా ... ఆ మార్గంలో ప్రజల రాకపోకలు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ కాంతిరాణాటాటా తెలిపారు. మీసాల రాజారావు వంతెన మీదుగా జీఎస్‌రాజు రోడ్డు, ప్రభుత్వ ముద్రణాలయం కూడలి, పై వంతెన, డాబాకొట్లు సెంటరు, మాకినేని బసవపున్నయ్య స్టేడియం వరకు సుమారు 25 వేల మందితో సిపిఐ ప్రదర్శన నిర్వహించనున్నారని చెప్పారు. ప్రదర్శన వేళ ట్రాఫిక్‌కు ఎలాంటి అవాంతరం కలగకుండా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు సూచించిన మార్గంలో ప్రజలు ప్రయాణించి, ఆయా ప్రాంతాల్లో తమ వాహనాలను నిలిపి సహకరించాలని సిపి కోరారు.
ఈ మార్గాల్లో వాహనాలు అనుమతించబడవు..
సీతన్నపేట నుంచి బుడమేరు వంతెన కూడలి వరకు ఎలాంటి వాహనాలను అనుమతించరు.
ఏలూరు లాకులు నుంచి సీకేరెడ్డి రోడ్డు, జీఎస్‌రాజు రోడ్డులోకి, బుడమేరు వంతెన వైపు, ప్రభుత్వ ముద్రణాలయం వైపు ఎలాంటి వాహనాలను అనుమతించరు.
మార్గాల మళ్లింపు.. ఈవైపుగా వెళ్ళచ్చు..
రైల్వేస్టేషన్ నుంచి అజిత్‌సింగ్‌నగర్ వైపు వెళ్లే వాహనాలను ఏలూరు లాకులు, అలంకార్ కూడలి, సాంబమూర్తిరోడ్డు, బోసుబమ్మ కూడలి, సంగీత కళాశాల, బి.ఆర్.టిఎస్.రోడ్డు, గుణదల సెంటరు, రామవరప్పాడు రింగ్, ఇన్నర్ రింగ్‌రోడ్డు మీదుగా కండ్రిక వైపు వెళ్లాలి.
చిట్టినగర్ నుంచి ఎర్రకట్ట మీదుగా వచ్చే వాహనాలను కాళేశ్వరరావు మార్కెట్ మీదుగా వెళ్లాలి. ఎర్రకట్ట మీదుగా అజిత్‌సింగ్‌నగర్, నూజివీడు వైపు వెళ్లే వారు.. సీవీఆర్ పైవంతెన మీదుగా వై.వి.రావు ఎస్టేట్, పైపుల రోడ్డు మీదుగా వెళ్లాలి.
నున్న, నూజివీడు వైపు నుంచి కండ్రిక కూడలి మీదుగా వచ్చే వాహనాలను కండ్రిక జంక్షన్ వద్ద మళ్లించి ఇన్నర్‌రింగ్ రోడ్డు, రామవరప్పాడు రింగ్ మీదుగా నగరంలోకి రావాలి.
పైపుల రోడ్డు, పాయకాపురం మీదుగా వన్‌టౌన్ వెళ్లే ప్రయాణికులు వై.వి.రావు ఎస్టేట్, సీవీఆర్ పైవంతెన, పాల ఫ్యాక్టరీ మీదుగా వెళ్లాలి.
వాహనాల పార్కింగ్‌లు..
ఇబ్రహీంపట్నం వైపు కార్యకర్తలను తీసుకువచ్చే బస్సులు, లారీలు గొల్లపూడి బైపాస్, సీవీఆర్ పైవంతెన, వై.వి.రావు ఎస్టేట్ మీదుగా ఎక్సెల్ ప్లాంటు రోడ్డులో నిలపాలి. కార్లు, ఆటోల్లో వచ్చే వారు ఎర్రకట్ట మీదుగా మీసాల రాజారావు వంతెన వద్ద నుంచి బి.ఆర్.టి.ఎస్. రోడ్డులో మధ్య నిలపాలి.
గుంటూరు వైపు నుంచి వచ్చే బస్సులు, లారీలు.. వారధి మీదుగా వచ్చి బెంజిసర్కిల్ పైవంతెన మీదుగా రామవరప్పాడు రింగ్, ఇన్నర్‌రింగ్ రోడ్డు, కండ్రిక కూడలి, పైపులరోడ్డు మీదుగా వెళ్లి ఎక్సెల్ ప్లాంట్ రోడ్డులో నిలపాలి. కార్లు, ఆటోలను బెంజిసర్కిల్ పైవంతెన మీదుగా రామవరప్పాడు రింగ్, గుణదల మీదుగా మధురానగర్ జంక్షన్ వద్ద బి.ఆర్.టి.ఎస్.రోడ్డు మధ్యలో పార్కింగ్ చేసుకోవాలి.
నూజివీడు వైపు వచ్చే వాహనాలను పైపులరోడ్డు, వాంబేకాలనీకి వెళ్లే ఎక్సెల్ ప్లాంట్ రోడ్డులో నిలపాలి. లి విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లా నుంచి వచ్చే లారీలు, బస్సులను రామవరప్పాడు రింగ్ నుంచి కండ్రిక కూడలి, పైపుల రోడ్డు కూడలి మీదుగా ఎక్సెల్ ప్లాంట్ రోడ్డులో నిలపాలి. కార్లు, ఆటోలను రామవరప్పాడు రింగ్, గుణదల మీదుగా బి.ఆర్.టిఎస్. రోడ్డులో నిలపాలి.










