- భారీగా తరలివచ్చిన సిపిఐ శ్రేణులు
వామపక్ష ఐక్యత వర్ధిల్లాలని కోరుతూ సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా నేతలు సింగ్‌నగర్ డాబాకొట్టు సెంటర్ వద్ద బ్యానర్ చేపట్టి ప్రదర్శనకు స్వాగతం పలికారు. ప్రదర్శనలో పాల్గను సిపిఐ శ్రేణులకు మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. వామపక్ష ఐక్యత కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ లోతుపాతులు బుక్‌లెట్‌ను అమ్మారు. ఈ సందర్భంగా సిపిఐ శ్రేణులు, సిపిఎం నేతలతో సెల్ఫీలు దిగారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్రతినిధి తన మూడేళ్ల కుమారుడితో సిపిఎం జెండాను పట్టించి సౌహార్ధతను తెలియజేశారు. బీహార్‌కు చెందిన జయప్రకాష్, సురేందర్‌కుమార్ సింగ్, గజేంద్రచౌదరి తదితరులు సిపిఎం నేతల వద్దకువచ్చి సౌహార్ధత తెలిపారు. రెడ్‌సెల్యూట్ కామ్రేడ్స్ అంటూ నినాదాలు చేశారు. పిడికిలి బిగించి అభివాదం చేశారు. సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ, సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి భూపతి రమణారావు, పశ్చిమ సిటీ కమిటీ కార్యదర్శి బోయి సత్యబాబు, పి.కృష్ణ, కె.దుర్గారావు, టి.ప్రవీణ్, కృష్ణమూర్తి, సిహెచ్ శ్రీనివాస్, వై.సుబ్బారావు, జి.ఆదిలక్ష్మి, జాన్సీ, ఆషా, సోమేశ్వరరావు, వెంకటేశ్వరరావు, ఎస్‌కె.నిజాముద్దీన్ తదితరులు పాల్గనాురు.
బోనాలు, ప్రభలతో పాటు, కోలాటం,డప్పు, తీన్‌మార్ నృత్యాలను ప్రదర్శనలో పాల్గను కార్యకర్తలు ప్రదర్శించారు. తెలంగాణా రాష్ట్రం సూర్యాపేట జిల్లాకుచెందిన మహిళలు బోనాలతో ప్రదర్శనలో పాల్గనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వెంట వచ్చిన పసి పిల్లలను భుజాల మీద ఎక్కించుకుని తల్లిదండ్రులు ప్రదర్శనలో పాల్గనాురు. విశాఖపటుం జిల్లా నుంచి వచ్చిన మహిళా రెడ్‌షర్టు వాలంటీర్లు 110 మీటర్ల పార్టీ జెండాతో ప్రదర్శనలో పాల్గనాురు. ఈ సందర్భంగా ప్రదర్శించిన మతోన్మాదం, జిఎస్‌టి భారాల భూతం వేషాలు ఆకట్టుకున్నాయి. వివిధ జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన వారు తమ ప్రాంతాల బ్యానర్లను ప్రదర్శించారు.
గురువారం రాత్రి నుండే...
వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో సిపిఐ కార్యకర్తలు గురువారం రాత్రికే విజయవాడకు చేరుకున్నారు. శుక్రవారం కూడా వీరి రాక కొనసాగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు తెలంగాణా, కేరళ, కరాుటక, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి రైళుబస్సులు, లారీలు, జీపుల్లో తరలివచ్చారు.దీంతో ఉదయం నుంచే నగరంలో సందడి నెలకొంది.
సిపిఎం సంఘీభావం
ప్రజాశక్తి - కృష్ణాప్రతినిధి, విజయవాడ : ఎర్రదండు కదం తొక్కింది. సుత్తి,కొడవలి జెండాలతో బెజవాడ అరుణారుణమైంది. కిలోమీటర్ల మేర ఎక్కడ చూసినా ఎర్రజెండాలు.. ఎక్కడ విన్నా మతోన్మాదానికి వ్యతిరేకంగా నినదించే గొంతులు! సిపిఐ జాతీయ మహాసభ సందర్భంగా శుక్రవారం కనిపించిన దృశ్యాలు. మీసాల రాజారావు బ్రిడ్జి నుండి సింగ్ నగర్‌లోని సిఆర్ మైదానం (మాకినేని బసవపునుయ్య స్టేడియం) వరకుసాగిన మహా ప్రదర్శనలో వేలాదిమంది సిపిఐ కార్యకర్తలు, అభిమానులు భాగస్వాములయ్యారు. జిఎస్ రాజు రోడ్డు, గవరుమెంట్ ఫ్రింటింగ్ ప్రెస్, బుడమేరు వంతెన, అల్లూరు సీతారామరాజు విగ్రహం సెంటర్, సింగ్‌నగర్ ఫ్లైవోవర్, డాబా కొట్లు సెంటర్ మీదుగా సుమారు ఐదు కిలోమీటర్ల మేర ప్రదర్శన సాగింది. సాయంత్రం మూడునుర గంటలకు ప్రారంభమైన ఈ ప్రదర్శన 5.30 గంటలకుముగిసింది. సిపిఐ జాతీయ, రాష్ట్ర నాయకులు కె.నారాయణ, బినయ్ విశ్వం, అతుల్‌కుమార్ అంజన్, కె.రామకృష్ణ, జెవివి.సత్యనారాయణమూర్తి, రావుల వెంకయ్య, చాడ వెంకటరెడ్డి, అక్కినేనివనజ తదితరులు ప్రదర్శన అగ్రభాగాన నిలిచారు. 24వ మహాసభ ప్రారంభ సూచికగా రెడ్‌షర్టు వలంటీర్లు 24 భారీ జెండాలతో ప్రదర్శనలో పాల్గనాురు. వందలాదిమంది రెడ్‌షర్ట్ వాలంటీర్లు చేసిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.బాల సంఘం, యువకులు, విద్యార్థులు, తలకుఎర్ర టోపీ, చేతిలో కర్రలతో ప్రదర్శనలో కదిలారు. పెద్ద సంఖ్యలో భాగస్వాములయిన మహిళలు భారీ ఎర్రజెండాను ప్రదర్శించారు.
బోనాలు... ప్రభలు

















