రాంచి : సిపిఐ (ఎంఎల్) నేత నాందేవ్ సింగ్ (45) హత్యకు గురయ్యారు. భూ వివాదంలో బంధువులే అతన్ని కొట్టి చంపినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న (ఆదివారం) జార్ఖండ్ రాష్ట్రంలోని లతేహర్ జిల్లా, రాంచీకి 130 కిలోమీటర్ల దూరంలోని జలిమా గ్రామంలో జరిగింది. భూ వివాదంలో నాందేవ్‌కి, అతని బంధువులకి జరిగిన గొడవల్లో.. బంధువులే.. నాందేవ్‌ని అతి దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని మాణిక పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ భాన్ ప్రతాప్ తెలిపారు. ఈ ఘటనపై సిపిఐ (ఎంఎల్) సభ్యుడు అజరు యాదవ్ మాట్లాడుతూ.. 'నాందేవ్ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్నారు. హత్య చేసిన నిందితులని వెంటనే అరెస్టు చేయాలి' అని ఆయన డిమాండ్ చేశారు.