ప్రజాశక్తి-కంచికచర్ల (ఎన్‌టిఆర్‌జిల్లా) : కంచికచర్ల మండలంలోని పరిటాల గ్రామంలో గురువారం ఉదయం గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మ్లెఏ్య డాక్టర్ మొండితోక జగన్ మోహన్‌రావు పాల్గొన్నారు. ప్రతి గడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించడంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు -లబ్ధిదారులకు అందుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 98 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. ప్రతి సచివాలయ పరిధిలో సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు, గత చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే పథకాలు అందేవని, నేడు అర్హత ఉంటే పథకాలు ఇంటి ముంగిటకే అందుతున్నాయని చెప్పారు, నిరంతరం ప్రజల కోసం పరితపిస్తున్న సీఎం జగనన్నకు మళ్ళీ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యద్దనపూడి జోష్ణ, ఎంపీపీ మలక్ బషీర్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మార్త రజిని శ్రీనివాస్, జడ్పిటిసి వేల్పుల ప్రశాంతి, నాయకులు చింతా రవీంద్ర, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కంచర్ల పద్మ, యద్దనపూడి విజయరామారావు తదితరులు పాల్గొన్నారు.










