Oct 06,2023 19:35

రవికాంత్‌ పేరుపు దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో సుమ కొడుకు రోషన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్‌ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మానస చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను దర్శక ధీరుడు రాజమౌళి విడుదలచేశారు. 'బబుల్‌ గమ్‌' టైటిల్‌ను ఫిక్స్‌ చేసిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేస్తూ 'నటుడిగా అరంగేట్రం చేసిన రోషన్‌ నీకు అభినందనలు. నీకంటూ ఒక సొంత గుర్తింపు తెచ్చుకొని రాజీవ్‌ మరియు సుమ గారు గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నాను. బబుల్‌ గమ్‌ టీమ్‌కు బెస్ట్‌ విషెస్‌' రాజమౌళి ట్వీట్‌ చేశారు. ఈ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ను అక్టోబర్‌ 10 న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.