ప్రజాశక్తి - పెద్దాపురం (కాకినాడ) : మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురిచేసిన బిజెపి ఎంపీ బ్రీజ్ భూషణ్ సింగ్‌ను వెంటనే అరెస్టు చేసి అతని పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ రైతుకూలి సంఘం ఆధ్వర్యంలో పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ.. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజురోజుకు మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్, ముసిలి బాబు, ఆదినారాయణ, శివాజీ తదితరులు పాల్గొన్నారు.










