మారుతున్నాయి
మారుతున్నాయి
వీధికో పేరు
ఊరికో పేరు
జిల్లాకో పేరు
పథకానికో ఒక పేరు
ఉచితానికో ఒక పేరు
ఉన్నదానికొక పేరు
లేనిదానికొక పేరు
మారుతున్నాయి.. మారుతున్నాయి..
కానీ ఏళ్లు గడుస్తున్నా
అదే మనుషులు
అదే మాటలు
ఏ మార్పు లేని జీవితాలు
యామరుతున్న జీవితాలు
అవే వెతలు
అవే వేదనలు
అవే 'బ్రతుకులు'
లక్ష్మీ శ్రీనివాస్ తాళ్ళపల్లి
9676601192