ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అండర్ 19 స్కూల్ గేమ్స్ వాలీబాల్ జిల్లా జట్లు ఎంపిక పూర్తయ్యినట్లు అండర్ 19 స్కూల్ గేమ్స్ కార్యదర్శి పీవీఎల్ ఎన్ కష్ణ తెలిపారు. గురువారం స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణంలో జరిగిన ఎంపిక పోటీలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వంద మందికి పైగా విద్యార్థులు హజరైనట్లు తెలిపారు. విద్యార్థులు మద్య ఎంపిక పోటీలు నిర్వహించి జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. బాల, బాలికలు జట్లుకు జట్టుకు 12 మంది చొప్పున క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఎంపిక ప్రక్రియ జిల్లా వాలీబాల్, అసోసియేషన్ నాయకులు, వ్యాయమ ఉపాద్యాయులు అధ్వర్యంలో ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో నెలాఖరున జరగనున్న రాష్ట్ర పోటీలకు జిల్లా జట్లు ను పంపించడం జరుగుతుందన్నారు. ఎంపిక ప్రక్రియలో వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి భగవాన్ దాస్,జిల్లా కార్యదర్శి కె వి ఏ ఎన్ రాజు,సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు కృష్ణం రాజు,ఎన్.వెంకట నాయుడు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










