ప్రజాశక్తి-ఏలేశ్వరం (కాకినాడ) : కాకినాడ జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పైలా సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు వేడుకలు ఏలేశ్వరంలో అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఏలేశ్వరం బాలాజీ సౌక్ సెంటర్లో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం మూడు వేల మందికి అన్నదానం నిర్వహించారు. పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు అభిమానులు కార్యకర్తలు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు.










