
నరసరావుపేట (పల్నాడు) : బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడటంతో ఐదుగురికి స్వల్ప గాయాలైన ఘటన మంగళవారం నరసరావుపేట మండలం కోటప్పకొండ వద్ద జరిగింది. కోటప్పకొండ త్రికోటేశ్వరుని దర్శనానికి వస్తుండగా... ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడినవారంతా నంద్యాల జిల్లా గాజులపల్లి వాసులుగా గుర్తించారు. వారందరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.