
ప్రజాశక్తి-పాలకొల్లు (పశ్చిమగోదావరి జిల్లా) : మెగాస్టార్ చిరంజీవి 68 వ పుట్టినరోజు వేడులను పాలకొల్లులో రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి తులా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా నిర్వహించే విధంగా స్థానిక ఆపద్బంధు బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జన్మదిన వేడుకలను జనసేన పట్టణ అధ్యక్షులు శిడగం సురేంద్ర బర్త్ డే కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. 40 మంది చిరంజీవి అభిమానులు రక్తదానం చేశారు. వీరికి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, హైదరాబాద్ నుండి చిరంజీవి, రామ్ చరణ్‌ల సంతకాలతో కూడిన అభినందన పత్రాలు తులా రామలింగేశ్వరరావు చేతుల మీదుగా దాతలకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరము వలె జన్మదిన వారోత్సవాల్లో భాగంగా పెద మామిడిపల్లి, అబ్బిరాజుపాలెంలలో 2 రోజుల కార్యక్రమాలు నిర్వహించామని మంగళవారం పాలకొల్లులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చిరంజీవి సూచించిన రక్తదాన సేవా మార్గంలో 1996 నుండి ఇప్పటివరకు ఎన్నో వేల మందికి రక్తదానం చేశామని ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, చిరంజీవి నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆచంట చరణ్ దీప్, తులా సురేష్, మల్లిపూడి సాంబ, మోపిదేవి అప్పారావు, వెలిగట్ల శ్రీను, కాపిశెట్టి పెదకాపు, సిరిగినీడి ఆంజనీ కుమార్, సాధనాల దుర్గాబాబు, సాయి, అఖిల్ అలుగు సత్తిబాబు అభిమానులు పాల్గొన్నారు