
ఇంటర్నెట్‌డెస్క్ : పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపునొప్పి వస్తుందా? రోజూ మహిళలు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే ఆ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి వేటిని ఆహారంంగా తీసుకోవాలో తెలుసుకుందామా..!
ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరం
బయట దొరికే జంక్ ఫుడ్స్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. అందుకే బయటి ఫుడ్స్‌ని తిన్నవారిలో పీరియడ్స్ సమయంలో కడుపుబ్బరం, నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పికి దూరం కావాలనుకుంటే తప్పనిసరిగా ఇంట్లో తయారుచేసుకున్న వాటిని తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది.
- ఫైబర్ ఎక్కువగా ఉండే అరటిపండ్లు, చిక్కుళ్లు, డ్రైఫూట్స్, స్ట్రాబెర్రీ వంటివాటిని ఎక్కువగా తింటే రుతుక్రమ సమయంలో ఎదుర్కొనే సమస్యల్ని దూరం చేసుకోవచ్చు.
- వారానికి కనీసం 2.5 గంటలు వ్యాయామం చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి. తప్పనిసరి వ్యాయామం మీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను పూర్తిగా దూరం చేస్తుంది.