
రాయ్ పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని ఉక్కు ఫ్యాక్టరీలో ఆదివారం పేలుడు సంభవించడంతో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. రస్మారాలోని రారుపూర్ స్టీల్ ప్లాంట్‌లో స్టీల్ కరిగించే పని జరుగుతుండగా పేలుడు సంభవించింది. ఘటనా స్థలంలో కనీసం వంద మందికి పైగా కార్మికులు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సెక్టార్ 9 భిలారులోని జెఎల్‌ఎన్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఖేమ్లాల్ సాహు (38) మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు కార్మికుల పరిస్థితి నిలకడగా ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.