Apr 20,2023 15:14

ప్రజాశక్తి-పెదబయలు(అల్లూరి) : మండల కేంద్రంలో తెలుగుదేశం అదినేత మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదిన వేడుకలు తెలుగు యువత అద్యక్షుడు ఎల్‌ త్రినాథ్‌ ( చిన్ని) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసి ఆదివాసీ గిరిజనుల సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు సాగాలన్నారు. ఈకార్యక్రమంలో లక్ష్మీ పేట సర్పంచ్‌ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు