ఇంటర్నెట్‌డెస్క్ : మైక్రోసాఫ్ట్ మాజీ సిఇఓ బిల్‌గేట్స్ మ్యాన్‌హోల్‌లోకి వెళ్లే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కోటీశ్వరుడైన బిల్‌గేట్స్ మ్యాన్‌హోల్‌లోకి ఎందుకు దిగారు? అనే ప్రశ్నలు వస్తాయి. అయితే ఆయన నవంబర్ 19వ తేదీ వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా బ్రస్సెల్స్ భూగర్భ నీటి వ్యర్థ వ్యవస్థ చరిత్రను తెలుసుకునేందుకు ఆయన ఇలా మ్యాన్‌హోల్‌లోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను బిల్‌గేట్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన 'నేను బ్రస్సెల్స్ మురుగునీటి వ్యవస్థ చరిత్ర. ప్రపంచ ఆరోగ్యంలో మురుగునీటి పాత్ర ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను తెలుసుకునేందుకు వెళ్లాను. 1800లలో మురుగునీరు నగరంలోని సెన్నె నదిలోకి డంప్ డంప్ అయింది. అది భయంకరమైన కలరా మహమ్మారికి దారితీసింది. అయితే ఇప్పుడలా లేదు. ప్రస్తుతం 200 మైళ్ల మురుగు కాలువల నెట్వర్క్ మరియు ట్రీట్‌మెంట్ ప్లాంట్లు నగరంలోని వ్యర్థాలను ప్రాసెస్ చేస్తాయి. ఈ విషయాన్ని నేను శాస్త్రవేత్తల్ని అడిగి తెలుసుకున్నాను.' అని ఈ వీడియోకు జతగా జోడించారు.