Oct 24,2023 11:27

ప్రజాశక్తి-పెరవలి (తూర్పు గోదావరి) : ఇసుక లారీని వెనుకవైపు నుండి బైక్‌ ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలైన ఘటన మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో జరిగింది. పెనుమంచిలి గ్రామానికి చెందిన నక్క మహేష్‌ (18), నక్క విజయ్ (35) స్వగ్రామం నుండి మెటర్‌ బైక్‌ పై తణుకు టౌన్‌ ఆస్పత్రికి వెళుతుండగా, మార్గమధ్యలో జాతీయ రహదారి పెరవలి సెంటర్‌కు వచ్చే ఇసుక ర్యాంప్‌ నుండి జాతీయ రహదారి మీదికి వస్తున్న ఇసుక లారీని వెనుక వైపు నుండి బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఎస్సై ఎం.సూర్య భగవాన్‌ కేసు నమోదు చేశారు.