Oct 01,2022 11:57

ప్రజాశక్తి -భోగాపురం (విజయనగరం) : భోగాపురం మోడల్‌ స్కూల్‌లో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన బావిశెట్టి మమత ట్రిపుల్‌ ఐటీకి ఎంపికైంది. భోగాపురం గ్రామానికి చెందిన బావిశెట్టి వెంకట్రావు, లక్ష్మి లకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అయిన మమత మోడల్‌ స్కూల్‌ లో 6 నుంచి పదో తరగతి వరకు చదివింది. 10లో 576 మార్కులు సాధించింది. శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌కి ఎంపికైంది. పలువురు ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థులను అభినందించారు.