Oct 17,2023 19:18

భగవంత్‌కేసరి సినిమా అందరికీ నచ్చుతుందనీ చూడాల్సిందిగా ప్రేక్షకులకు సినీనటి కాజల్‌ అగర్వాల్‌ అన్నారు. హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌లో రూపొందుతున్న సినిమా 'భగవంత్‌ కేసరి'. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. దసరా కానుకగా ఈనెల 19న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ విలేకరుల సమావేశంలో 'భగవంత్‌ కేసరి' విశేషాలని పంచుకున్నారు. భగవంత్‌కేసరిలో కాత్యాయని ఒక సైకాలజిస్ట్‌. చాలా స్మార్ట్‌, ఇంటెలిజెంట్‌. అలాగే నా పాత్ర చాలా సరదాగానూ, చాలా హ్యుమర్‌ వుంటుంది. ఈ పాత్ర చేస్తున్నపుడు చాలా ఎంజారు చేశాను. భగవంత్‌ కేసరి' కాన్సప్ట్‌ నాకు చాలా నచ్చింది. ఆడపిల్లని ధైర్యంగా పెంచడం, అలాగే మహిళా సాధికారత గురించి మాట్లాడే అవసరం ప్రస్తుత సమాజంలో వుంది. మన సూపర్‌ స్టార్స్‌ ఇలాంటి కథలు చెప్పడాని ముందుకు రావడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. నా పాత్ర ఎలా వుందో అని కాకుండా ఈ కథ చెప్పాల్సిన అవసరం వుందని చేసిన సినిమా ఇది. ఇలాంటి మంచి సందేశం ప్రజల్లోకి వెళ్లాలి. అలాంటి ఓ గొప్ప సినిమాలో భాగం కావడం ఆనందం వుంది.