Sep 15,2023 15:02

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఇటీవలి కాలంలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తున్నా.. గుండె సంబంధిత సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏరోబిక్‌ వ్యాయామాలు చేస్తే.. గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయని వైద్యులు సూచిస్తున్నారు.

- వాకింగ్‌, జాగింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌, నడుము కదిలించే వంటి వ్యాయామాలు రోజూ చేస్తే.. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

- ఏరోబిక్‌ వ్యాయామాల్ని వారంలో కనీసం ఐదురోజులపాటు చేస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. శారీరక వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకర ఆహారపు అలవాట్ల వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. అందుకే గుండె ఆరోగ్యం కోసం ఏరోబిక్‌ వ్యాయామాలు చేయడం వల్ల గుండె ఆరోగ్యంతోపాటు, ఇతర అనారోగ్యాలు కూడా దరిచేరవని వైద్యులు చెబుతున్నారు.