Apr 16,2023 12:28

ప్రజాశక్తి-సామర్లకోట(కాకినాడ) : ఎండ తీవ్రత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో మైత్రి యువజన సంఘం ఆధ్వర్యంలో లారీ స్టాండ్‌ మార్గంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. మజ్జిగ చలివేంద్రాన్ని పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ ఛార్జ్‌ తుమ్మల రామస్వామి (బాబు) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడంలో గాని ప్రజా సమస్యలపై గళం ఎత్తడంలో గాని జనసేన పార్టీ, జన సైనికులు ముందు ఉండడం జరుగుతుందని పేర్కొన్నారు. చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన మైత్రి యువజన సేవా సంఘాన్ని బాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో మైత్రి యువజన సేవా సంఘం గౌరవ అధ్యక్షులు కే వి వి సత్యనారాయణ, అధ్యక్ష, కార్యదర్శులు తలారి వరహాలు, కలగా లావరాజు, ట్రెజరర్‌ పుట్ట కొండలరావు జనసేన పట్టణ అధ్యక్షులు సరోజ వాసు,కరణం కామేశ్వరరావు,మంచెం సాయిబాబు,అత్తిలి కృష్ణ,దేశెట్టి శ్రీను,స్ప్షాట్‌,మంచెం రాజు, బొక్షు నానాజీ,బాపిరాజు,పెద్దబాబులు,చిన్ని రాజా తదితరులు పాల్గొన్నారు.