ప్రజాశక్తి - జగ్గంపేట రూరల్, కిర్లంపూడి (కాకినాడ) : గుర్తు తెలియని వాహనం ఢీకొని యాచకుడు మృతి చెందిన సంఘటన శనివారం బురుగుపూడిలో చోటు చేసుకుంది. కిర్లంపూడి ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మతిస్థిమితం లేని యాచకుడు నెల రోజుల నుంచి కృష్ణవరం నుంచి బూరుగుపూడి మధ్య తిరుగుతున్నాడన్నారు. శనివారం ఉదయం బూరుపూడి జాతీయ రహదారి దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అతని శరీరం నుజ్జు నుజ్జయిందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.










